https://www.facebook.com/chinaveera?fref=nf_fr
by Vadrevu Ch Veerabhadrudu
కృష్ణపక్షపు రాత్రి. ఒక్కణ్ణీ డాబామీద,ఆకాశంలో పెద్ద
పిక్సెలు మాపు ఒకటి తెరుచుకుంటున్న వెలుతురు,
అంతదాకా నా జీవితకేత్రం సమస్తం ఆవరించిన నగరం
నాకు తెలీకుండానే ఎప్పుడో మినిమైజయిపోయింది.
స్వర్గంనుంచి నదివాలులో కొట్టుకొస్తున్నబంగారుముద్ద
లాగా చంద్రుడు. పండుగడ్డిలో మగ్గబెట్టినమామిడిపండు
తొడిమమీంచి పారిన వెండిజీడి చార,కొండరెడ్ల ఇళ్ళల్లో
అటకమీద బోర్లించిపెట్టిన సేవెండిగిన్నెల తళుకుబెళుకు.
మాటలకంటుకున్న మట్టి రాలి, సుగంధం స్రవిస్తున్న
వేళ, ఆ ఏకాంతవీథిలో నా చిన్నప్పటిగ్రామాల యాస
మాట్లాడేవాడొకడు హఠాత్తుగా పలకరించాడు, గూగుల్
ఎర్త్ లో కనబడని దేశపటమొకటి తెరిచి చూపించాడు
** Another Poem by Vadrevu Ch Veerabhadrudu
beautiful description of early morning silence:
తెల్లవారుజాము మూడున్నర: కొన్ని స్వరాలు నేల
నుంచినింగికీ, నింగినుంచి నేలకీ ప్రయాణిస్తున్నాయి,
నిద్రలో చంద్రుడికి చేరువగా జరిగిన చెట్లు, భూమిలో
బంగారం, ఓషధుల్లో అమృతం పేరుకుంటున్న నిశ్శబ్దం.
అక్కడ నగరానికి చోటు లేదు, వార్తాపత్రికలింకా
రోడ్డున పడలేదు, ఇప్పుడొక వైణికురాలు సాధనకోసం
తీగలు సవరిస్తూండవచ్చు, ఎక్కడో ఒక సాధువు
రాత్రంతా పడ్డ వేదన ప్రార్థనగా మారుతుండవచ్చు.
నిర్విరామంగా కురిసిన వెన్నెలతో జలాశయాలన్నీ
నిండిపోయినట్టొక లేతతెమ్మెర. మరికొంత సేపట్లో
నీళ్ళు వదుల్తారు, ఇంటికొచ్చి కుళాయి తిప్పినట్టు
కోకిల ఆకాశపు మూత తీసేస్తుంది, తెల్లవారుతుంది

No comments:
Post a Comment