A Poem by Kavitha Prasad Rallabandi
https://www.facebook.com/kavithaprasad.rallabandi
నువ్వెప్పుడైనా ఉద్యానవనంగా మారావా ?
'లేదు'
అయితే నువ్వు పువ్వుల్ని కోల్పోయావు ....
నువ్వెప్పుడైనా నదిగా మారావా?
'లేదు'
అయితే నువ్వు అన్నిదాహాలు కోల్పోయావు .....
నువ్వెప్పుడైనా ఎడారిగానన్నా మారావా?
'లేదు'
అయితేనువ్వుఎన్నో ఒయాసిస్సుల్నికోల్పోయావు ....
'లేదు'
కనీసం నువ్వు నువ్వుగానన్నా మారావా?
' లేదు'
అందుకే నన్ను కోల్పోయావ్ !
__ Kavitha Prasad Rallabandi
No comments:
Post a Comment