Tuesday, May 21, 2013

Poem 10


అపూర్వం
డా||ఎన్ గోపి

కొంతదూరం
కలిసి వెళ్తుంది గాని
సంగీతం
భాషను మధ్యలొ వదిలెస్తుంది.
యుగయుగాల
మానవ సంవేదన
శబ్దాల పై విజయం సాధిస్తుంది


ఏకీ ఏకీ
దూదిని మెత్తబరిచే
శ్రామికుడి లాగ
పదాలతో
పరుపును తయారు చేస్తాడు కవి.
అలసిపోయిన జీవితం
అలా కునుకు తీస్తుందో లేదో
స్వప్నాలు హాజరు

ఈ స్వప్నాలు మునుపటిలా వుండవు
శరీరం లోంచి బయటికి వెళ్ళే
భావనా తరంగాలై
లోకం నిండా వ్యాపిస్తాయి

ఏదో వింతకాంతిలో
లోకం కొత్తగా కనిపిస్తుంది
అనవసర జ్ఞనాన్ని వదుల్చుకొని
కవి ఆదివాసిగా మారిపోతాడు
ఆకుల్లాంటి అమాయకత్వంతో
అందరి మేలును శ్వాసిస్తాడు

(from CHINUKU 8th anniversary special Issue)


No comments:

Post a Comment