Sunday, May 26, 2013

అం'తరంగం' by Jayashree Naidu

16. ఓక స్వచ్చత బుగ్గల్లో మెరిసింది
ఒక పసితనం రూపమయ్యింది
వెన్నెల చల్లదనం నేత నేసుకుని 
జీరాడే పావడా అయ్యింది
ఓ చందమామ నేల మీద నవ్వింది నిన్న..


15. జ్ఞాపకాలుగా వెళ్ళీపోయిన కాలాన్ని
గుర్తులుగా మనసు మోయగలదే కానీ...
వెనక్కి రప్పించగలదా... 



14.  తాళం వేసుకున్న అక్షరం 
బీగాన్ని విసిరేసింది
ఖాళీలు పూరించబడవని తెలియడం
అదేమీ గొప్ప జ్ఞానం కాదు
అజ్ఞానాన్ని ఆశకు రెండువైపులా అంటించి
ప్రపంచంలో కి నెట్టి... 
తీరని ఆశకు విలువ కట్టే 
మనసు బేహారితో వాదులాట


13. అలసట ఒక ఆట 
పడ్డవాడు చెడ్డవాడు కాదులే అంటూ మనసుకు పదాల పేరడీల ఊరట

కలిసి రాని కాలం లో కప్పైనా పామే..
పగటి కలల సామ్రాజ్యం లో అందరూ మహరాజులే..  

అనుభవాలు తొంగి చూసినప్పుడే 
గుండెకు చేసుకున్న కాస్మెటిక్ సర్జరీల చారికలు విరగబడి నవ్వేది 



12. ఒక చెంచాడు ఆనందం కోసం
కాలానికి గాలం

కష్టసుఖాల ఇరుసు బిగుస్తూనే వుంటుంది

ఆశకు ఊపిరందడం లేదని
వున్న  బంధాల్ని  నెట్టేసి
కొత్త బంధానికి తావు సృష్టిస్తా

అక్కడైనా ఊపిరాడుతుందేమోనన్న ఆశ  


11. చుట్టూ అన్నీ ప్రశ్నార్థకాలే
జవాబులన్నీ మరింత గందరగోళాలే

మరిచిపోవడం - నేర్చుకోవాల్సిన పాత పాఠం
ఎప్పటికప్పుడు జ్ఞాపకాల్ని చెరిపేస్తూ 
రాసుకునే కొత్త అక్షరం 

ఎప్పుడూ నువ్విచ్చే నిశ్శబ్దాన్ని 
వెంటొచ్చిన కాలం లో నింపేసి 
నన్ను నేను సంబాళించుకుంటూ నడుస్తున్న అడుగులు గుర్తొస్తున్నాయి  

వలస వెళ్ళలేని ఆశల్ని బుజ్జగిస్తూ 
కొత్తకలల్ని తెమ్మంటున్నా!  
30 July 2013


  • Chandra Shekhar Vemulapally ఆశకు ఊపిరందడం లేదని
    వున్న బంధాల్ని నెట్టేసి
    కొత్త బంధానికి తావు సృష్టిస్తా

    అక్కడైనా ఊపిరాడుతుందేమోనన్న ఆశ
    ...See More
  • KV Voice RASUKUNE KOTHA AKSHARALE KAVALI MANAKIPPUDU...
  • Nvmvarma Kalidindi చుట్టూ అన్నీ ప్రశ్నార్థకాలే
    జవాబులన్నీ మరింత గందరగోళాలే

    మరిచిపోవడం - నేర్చుకోవాల్సిన పాత పాఠం
    ఎప్పటికప్పుడు జ్ఞాపకాల్ని చెరిపేస్తూ 
    రాసుకునే కొత్త అక్షరం ...chaala baagaa cheppaaru.
  • Sri Modugu Very well said andi
  • Nagendra Bhallamudi ఆశకు ఊపిరందడం లేదని
    వున్న బంధాల్ని నెట్టేసి
    కొత్త బంధానికి తావు సృష్టిస్తా

    అక్కడైనా ఊపిరాడుతుందేమోనన్న ఆశ
    nice madem
  • Pusyami Sagar వలస వెళ్ళలేని ఆశల్ని బుజ్జగిస్తూ 
    కొత్తకలల్ని తెమ్మంటున్నా! wah wah ji ....chala baga c hpeapru
  • Satya Srinivas ఎప్పుడూ నువ్విచ్చే నిశ్శబ్దాన్ని 
    వెంటొచ్చిన కాలం లో నింపేసి 
    నన్ను నేను సంబాళించుకుంటూ నడుస్తున్న అడుగులు గుర్తొస్తున్నా
  • Kumar Varma Kayanikorothu ఎప్పటికప్పుడు జ్ఞాపకాల్ని చెరిపేస్తూ
    రాసుకునే కొత్త అక్షరం 
    ఎప్పుడూ నువ్విచ్చే నిశ్శబ్దాన్ని
    వెంటొచ్చిన కాలం లో నింపేసి
    నన్ను నేను సంబాళించుకుంటూ నడుస్తున్న అడుగులు గుర్తొస్తున్నాయి.. 
  • Rajendra Prasad Yalavarthy Nice. Kani Yenni manchi kotha kalalochhina>>Kallalu gane migili pothunnyi.
  • Sriramoju Haragopal అనుభవాలు తొంగి చూసినప్పుడే 
    గుండెకు చేసుకున్న కాస్మెటిక్ సర్జరీల చారికలు విరగబడి నవ్వేది ... కవిత మెస్మరిక్ ప్రజంటేషన్
  • Kavi Yakoob మరిచిపోవడం - నేర్చుకోవాల్సిన పాత పాఠం
    ఎప్పటికప్పుడు జ్ఞాపకాల్ని చెరిపేస్తూ 
    రాసుకునే కొత్త అక్షరం /సూపర్బ్ పోయెం జయశ్రీ గారు !
  • Anil Dani Antaranga tarangam baagaa aavishkarinchaaru good one
    10 hours ago via mobile · Unlike · 1
  • Kavi Savyasaachi వలస వెళ్ళలేని ఆశల్ని బుజ్జగిస్తూ 
    కొత్తకలల్ని తెమ్మంటున్నా!
    8 hours ago · Unlike · 1
  • Poornima Sudha అనుభవాలు తొంగి చూసినప్పుడే 
    గుండెకు చేసుకున్న కాస్మెటిక్ సర్జరీల చారికలు విరగబడి నవ్వేది ఆశకు ఊపిరందడం లేదని
    వున్న బంధాల్ని నెట్టేసి
    కొత్త బంధానికి తావు సృష్టిస్తా

    అక్కడైనా ఊపిరాడుతుందేమోనన్న ఆశ ... chaalaa baaundi

10. వొదిలొచ్చిన దారికేసి 
వొదిల్లేని జ్ఞాపకాలు
అప్పుడప్పుడూ.. కంటికి చూపై గుచ్చుతున్నాయి 

చలించని మనసుకు 
చూపెటుంటే యేం 
తనకేసి తనను తేరి పార చూసుకుని
ఇలా మారానా అని సంబాళించుకోవడం తప్ప 


9.  నా ప్రపంచానికి నేనొచ్చేశాను..
ఎప్పుడు వొదిలి వెళ్ళానో తెలీదు

తళతళలాడుతూ చేపపిల్లలా
మిల మిలలాడే నీటి నీడలా
సూర్యుడ్ని దాచుకున్న నీటి బుడగలా
చిమ్ముక్కొస్తున్న కాంతి కిరణం లా... 
అన్నీ అలాగే వున్నాయి..

సహజంగా.. శోభగా..
ఒక్క నేనే ఎటో.. ఎక్కడో.. 
తిరిగి అన్నిటినీ హత్తుకుంటూ..
అక్కున చేర్చుకుంటూ..


8. ఆచరణలేని మాటల ఆవరణ చూసి
రాలేని నవ్వు పెదవుల తలుపులు మూసుకుని
మరీ నవ్వుకుంటుంది.


7. మూసేసిన తెలియనితనాన్ని తెరుచుకుంటూ
అ 'మాయ ' కత్వాల్న్నీ 
మరింత కాలాన్నీ గుప్పిట పట్టడం కోసమే 
అనుక్షణం జీవితం



6. గుండె కొట్టుకోవడం మరిచిన క్షణాలు..
యే జీనీ ఎత్తుకెళ్ళిందో
చెప్పగలిగిన అల్లాదీన్ యెవరూ....


5. మెరుపు మెరిసిన క్షణం
అంతా అద్భుతం గా తోచి
వెలుగుని వెతుకుతూ 
మెరుపుని చేరాలన్న అమాయకత్వం


4. ఉప్పులో చక్కెరని కలిపినట్టుంది
నీడలో నీరెండకోసం వెతికినట్టుంది.. 

మనిషిగా సప్త సముద్రాలు దాటి వచ్చినా
మనసునంటని తడి

చిరుగులుపడ్డ చాపకూ.. చిగురాకుల చల్లదనానికీ
పాలలోని మీగడకూ.. మట్టినంటిన గంధానికీ
అవే ఎదురుచూపులు 

లోలోపలి గుంజాటనలు వొదిలి 
ఇంటిదారిని వెతకమంటూ బ్రతిమిలాడే నీడలు

3. పేజీల్లోని అక్షరాలు 
ఆరోపణల అధిరోహణైనపుడు
మనసు వాకిలి కుచించుకు పోతుంది

ఇన్ని చినుకుల మార్పుని చల్లుకుని
గుండె గుమ్మం తడుపుకుని 

మళ్ళీ కాలపు ముగ్గు ని 
వేళ్ళ మధ్య ఒడిసి పట్టి
క్షణాల కోలాహలం లో
మరో ప్రేమ కాలపు జీవితాన్ని దిద్దాలని..

2. జీవితం ఆలోచనంత దీర్ఘం
రెప్ప పాటంత క్షణికం 
అందుకే.. 
ఆలింగనం లాంటి ప్రేమ 
పాదరసంలా జారిపోకముందే 
మధు పాత్ర నింపుకోవడమే






1. నిరంతరం వెదుకులాటే..
ఆ చివరి నుండి యీ కొన వరకూ
ఆ చిగురు నుండి.. ఒక వేరు వరకూ
ఆకాశానికీ ఆశలకూ మధ్య 
ఊహల వారధి తో..

--- జయశ్రీ నాయుడు 

No comments:

Post a Comment