మనోజ్ఞ || అమ్మతనం వర్సెస్ ఆడతనం ||
పొత్తిళ్ళలో చంటిదాన్ని చూస్కుంటూ,
అర్ధరాత్రి చంటిదాని ఏడ్పులూ ..
సన్నగా నవ్వుకుంది ఆమె!
**లాలి పరమానంద రామ గోవిందా
కొన్నేళ్ళయ్యింది..
ఒక త్యాగమూర్తిగా అభివర్ణించి
కొన్ని పొందాలంటే కొన్ని కోల్పోవల్సిందే..
ఇక్కడ
ఈ రహస్యం
తర్వాతే అమ్మతనం వచ్చింది తనకు.
బిడ్డ, ఆ బిడ్డకు అమ్మ!.. ఇద్దరూ ఒక్కమారే పుట్టేరు!
అచ్చం తనలాంటి మీనియేచర్ని
తాకుతూ , మురిసిపోతూ..
ఓహ్ ! అనుభూతి ఇంతందంగా,
చెప్పనలవికాకుండా ఉంటుందా? అనుకుంది
నిండా ఇరవైయేళ్ళు కూడా దాటని ఆమె!
ఊర్కోబెట్టలేక నానా అవస్థలూ..
*ఏమిటీ గోల ?
పక్క గదిలోకి తీసుకెళ్ళి ఊర్కోబెడుదూ*!
అని మొగుడు గారి హుకుం!
బోల్డన్ని నిద్రలేని రాత్రులు!!
ఒకప్పటి నిద్రలేని/నిద్రపోనివ్వని రాత్రుల్ని తల్చుకుని !
అమ్మతనంలో ఎక్కడో
అస్పష్టంగా దాక్కున్న ఆడతనం ఒక్కమారు ఆవులించింది!
........ జో.. జో **...
అమ్మతనం గెల్చింది ఆడతనాన్ని నిద్రపుచ్చి!
ఇద్దరిపిల్లల తల్లితనిప్పుడు!
బాధ్యత నడుంకట్టుగా కట్టుకుంది.
మరి కోర్కెల రెక్కలు?!! అంటే ఏంటి? తన ప్రశ్న!
తనకసలు రెక్కలున్న సంగతే మరిపించేలా
ఒకలాంటి పెద్దరికం!
మళ్ళీ అమ్మతనమే గెలిచింది!
ఇంట్లో పెద్ద పీట వేసేరు తనకు !
అన్న నానుడి తనకూ తప్పలేదు..
కాకపోతే
తను ఏదీ కోల్పోవాలనుకోలేదు..
పొందాలనుకున్నకొన్ని మాత్రం కోల్పోయింది!
కోల్పోతూనే ఉంది..
అమ్మతనం ఆడతనాన్ని గెల్చిందా?
లేక
ఆడతనం అమ్మతనాన్ని గెల్పించిందా??
ఒక్క అమ్మకు మాత్రమే తెలుసు!!
No comments:
Post a Comment