Sunday, May 26, 2013

Poem 12

పి.రామకృష్ణ  // ఎప్పట్లాగే//

గుప్పెడు గింజల్నీ,
గిన్నెడు నీళ్ళనీ,
పిట్టగోడపై వుంచి
ఎదురుచూస్తున్నాను.
చెట్లను వెతుక్కుంటూ-
ఈ పక్షులన్నీ
ఎక్కడికి వెళ్ళాయో?
** ** **


ఎప్పట్లాగే
గుప్పెడు గింజల్ని చల్లి,
వాటిమీద-
గిన్నెడు నీళ్ళను పోసాను.
నాకు తెలుసు
పిట్టల కోసం వెతుక్కుంటూ
ఈ చెట్టు
ఎక్కడికీ వెళ్ళదు.


పి.రామకృష్ణ // భగవాన్ ఉవాచ//

ఆ ఆదివారపు మధ్యాహ్నం
ఓ చిన్నారి కోడిపిల్ల
అమ్మకోసం వెతుకుతూ, వెతుకుతూ..
దార్లో-
కారు టైరు క్రిందపడి,
చనిపోయింది.
1. అదే ఆదివారపు ఉదయం
తల్లికోడి-
కసాయి కత్తిక్రింద కంఠాన్ని వుంచి,
కళ్లు మూసుకుని, ఇలా ప్రార్థించింది.
“భగవంతుడా ఇలాంటి చావు-
నా బిడ్డకు రాకుండా చూడు” అని.

1 comment: