"పలమనేరు బాలాజి గారి" కొత్త పుస్తకం"ఇద్దరి మధ్య( కవిత్వం)"
విరిగిపోతున్నప్పుడు
తెలుసుకోవటం కూడా
అమాయకత్వమేనని అప్పటిదాకా
తెలియదు
కలలు ఙ్నాపకాల్లాంటి ప్రేమలు
యుద్ధ విద్యను నేర్పిస్తాయని
తెలియదు
మనుషులందరూ బ్రతికి లేరని
బ్రతకటం అంటే
సునాయాసంగా గాలి పీల్చి వదలటం
కాదని తెలియదు
నాకు విరిగిపోవటం తెలిసినంతగా
కరిగిపోవటం తెలియదు
విరిగి విరిగి విచ్ఛిన్నమై
అర్థాన్ని,జీవాన్ని కోల్పోయిన
ప్రతిసారీ
ఓటమి లోయల్లోకో
భయాల అగాధాల్లోకో
అవమానాల కొలుముల్లోకో
జారిపోతున్నప్పుడల్లా
భుజానికి భుజం ఆసరాగా నిలిపి
కన్నీటికి కన్నీరు తోడిచ్చి
మాటకు మాటిచ్చి
మనిషికి మనసిచ్చి
గుండె తడారిపోతున్న వేళల్లో
నన్ను బ్రతికించిన అమ్మతనానికి
బదులేమివ్వగలను?
విరిగిపోతున్నప్పుడు
తెలుసుకోవటం కూడా
అమాయకత్వమేనని అప్పటిదాకా
తెలియదు
కలలు ఙ్నాపకాల్లాంటి ప్రేమలు
యుద్ధ విద్యను నేర్పిస్తాయని
తెలియదు
మనుషులందరూ బ్రతికి లేరని
బ్రతకటం అంటే
సునాయాసంగా గాలి పీల్చి వదలటం
కాదని తెలియదు
నాకు విరిగిపోవటం తెలిసినంతగా
కరిగిపోవటం తెలియదు
విరిగి విరిగి విచ్ఛిన్నమై
అర్థాన్ని,జీవాన్ని కోల్పోయిన
ప్రతిసారీ
ఓటమి లోయల్లోకో
భయాల అగాధాల్లోకో
అవమానాల కొలుముల్లోకో
జారిపోతున్నప్పుడల్లా
భుజానికి భుజం ఆసరాగా నిలిపి
కన్నీటికి కన్నీరు తోడిచ్చి
మాటకు మాటిచ్చి
మనిషికి మనసిచ్చి
గుండె తడారిపోతున్న వేళల్లో
నన్ను బ్రతికించిన అమ్మతనానికి
బదులేమివ్వగలను?
No comments:
Post a Comment