Wednesday, May 8, 2013

Poem 2 -- Kopparti

 కొప్పర్తి ‘భయద సౌందర్యం’

డబ్బుల్లేకపోవడం
ఎంత బావుండదో అంత బావుంటుంది
జీవితం కళ అవ్వడం డబ్బుల్లేనపుడే సాధ్యపడుతుంది

సిటీ బస్సెక్కడం మానేసి మూడు మైళ్ళు నడిచి
మిగిల్చిన రూపాయి పెట్టి ఆమెకు మల్లెపూలు కొన్నపుడు
వాటి చల్లదనమూ తెల్లదనమూ
కందిన అరికాళ్ళని వెన్నముద్దల్ని చేస్తాయి


పొరుగూరు వెళ్ళినపుడు భోజనానికి బదులు రెండిడ్లీ తిని
మిగిల్చిన డబ్బులతో కొన్న లక్క పిడతల్లో
పాప ఉత్తుత్తి భోజనం వండి పెట్టినపుడు
మిగిలిన ఆకలి నిజంగా తీరుతుంది’
కవీ!…ఇదంతా సరే గానీ, డబ్బుల్లేని కాలం భయపెట్టిన రోజుల మాటేమిటి?
‘పచారీ సరుకుల లిస్టు లోంచి
కొన్ని పదాల్ని తొలగించి కొన్ని అంకెలని కుదించాల్సి వచ్చినపుడు మాత్రం
కవిత్వం అస్పష్టమై జీవితం సంక్లిష్టమౌతుంది
ప్రతి నెలా మొదటి తారీఖు
ఒక భయద సౌందర్య మూర్తయి ఆహ్వానిస్తుంది
…………………………………..
ఒక్క సారి ఎగిరి అవతలి నెలలో పడాలనిపిస్తుంది
లేదూ, ఒక్క నెల, ఒకే ఒక్క నెల
జీవితాన్ని నిలిపివేయాలనిపిస్తుంది’


http://vaakili.com/patrika/?p=2762

No comments:

Post a Comment