ఓ ఖగమా... నా మాంస ఖండాలన్నీ ఏరి ఏరి తిన్నా..
కళ్ళను మాత్రం వదిలెయ్యి..
నా ప్రియతమను చూసే ఆశని బ్రతకనీ..
శరీరమంతా వందల వాసనలు
మలినమైన కర్మలనే వస్త్రాలు..
రెక్కలతో ఎన్ని ఈదురు గాలుల్ని అధిగమించినా
నీలోని నిన్ను తప్పించుకోలేవు
ఆకాశాన్ని పగలగొట్టినా
ఇలని కలని చేసినా
నీనుండి నిన్ను దాచలేవు
ఎటు నుండి ఎటు వెళ్ళీనా
తిరిగి చేరేది నీ గూటికే
కళ్ళను మాత్రం వదిలెయ్యి..
నా ప్రియతమను చూసే ఆశని బ్రతకనీ..
శరీరమంతా వందల వాసనలు
మలినమైన కర్మలనే వస్త్రాలు..
రెక్కలతో ఎన్ని ఈదురు గాలుల్ని అధిగమించినా
నీలోని నిన్ను తప్పించుకోలేవు
ఆకాశాన్ని పగలగొట్టినా
ఇలని కలని చేసినా
నీనుండి నిన్ను దాచలేవు
ఎటు నుండి ఎటు వెళ్ళీనా
తిరిగి చేరేది నీ గూటికే