Thursday, October 31, 2013

Art Of Living: The Classic Manual on Virtue, Happiness and Effectiveness -- Vadrevu Ch VeerabhadruDu

 కొన్ని పుస్తకాలు మనదగ్గర చాలాకాలంగా ఉన్నా సమయం వచ్చినప్పుడు కాని మన దృష్టివాటిమీదకి పోదు. గత కొన్నాళ్ళుగా చెప్పలేని మనోవేదనని అనుభవిస్తున్న నాకు నా అల్మైరాలో చాలాకాలంగా నా చేతులకోసం ఎదురుచూస్తున్న పుస్తకమొకటి కనబడింది. అది ఠె Art Of Living: The Classic Manual on Virtue, Happiness and Effectiveness (హార్పర్ కాలిన్స్, 2005). షారోన్ లెబెల్ అనే రచయిత్రి, సంగీతసాధకురాలూ ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా ఎపిక్టెటస్ కు చేసిన అనువాదం. 

ఎపిక్టెటస్ (క్రీ.శ్ 55-135) ప్రసిద్ధ గ్రీకు-రోమన్ స్టోయిక్ తత్త్వవేత్తల్లో ఒకడు. రోమన్ సామ్రాజ్యపు తూర్పు సరిహద్దుల్లో జన్మించి జీవితం అధికభాగం బానిసగా జీవించాడు. ఆ కాలంలోనే ఎవరో యజమాని అతణ్ణి హింసించడంతో అవిటివాడిగా కూడా మారాడు. కొన్నాళ్ళకు బానిసత్వం నుంచి బయటపడ్డాక ఒక తాత్త్వికుడిగా సంచరించాడు క్రీ.శ 94 లో రోమన చక్రవర్తి డొమితియన్ తత్త్వవేత్తల్ని రోం నుంచి బహిష్కరించడంతో, వాయవ్య గ్రీసులోని నికొపొలిస్ అనే పట్టణానికి వెళ్ళి అక్కడే ఒక పాఠశాల నడుపుకుంటూ జీవించాడు. నిరాడంబరంగా చిన్న కుటీరంలో ఒక సాధుసత్తముడిగా జీవిస్తూ చేసిన బోధల్ని అతడి శిష్యుడు అరియన్ అనే యువకుడు గ్రంథస్థం చేసాడు. ఎనిమిది సంపుటాలుగా సంకలనమైన ఆ బోధనల్లో ప్రస్తుతం నాలుగు సంపుటాలు మాత్రమే లభ్యామవుతున్నాయి. వాటిల్లో డిస్చౌర్సెస్, నుంచీ, Enchiridion (Manual) నుంచీ కొన్ని భాగాల్ని షారోన్ అనువదించింది.

ఆ అనువాదాన్ని చదువుతుంటే రెండువేల ఏళ్ళ కిందటి రచన చదువుతున్నట్టు లేదు. ఇప్పటి సామాజిక జీవితంలో ఒత్తిళ్ళని తట్టుకోలేని యువతీయువకులకోసం గొప్ప మనస్తత్వ శాస్త్రజ్ఞుడు రాసిన కరదీపికలాగా ఉంది. 

ఎపిక్టెటస్ "Enchiridion (Manual)"భగవద్గీతనీ, దమ్మపదాన్నీ, తిరుక్కురళ్ నీ, తావో తేచింగ్ నీ,సువార్తల్నీ సహజంగానే గుర్తుకుతెస్తుంది. అయితే వాటికన్నా ఎపిక్టెటస్ మరింత ఆచరణాత్మకంగా, మరింత మానవసన్నిహితంగా మాట్లాడుతున్నాడు. అందుకనే ఆ రచన నేటికాలపు ఒక శెల్ఫ్-హెల్ప్ ంఅనూల్ గా కనిపించి నాకు కొత్తబలాన్ని అందించింది.

అందులోంచి కొన్ని వాక్యాలు మీ కోసం:

1
దేన్నైనా గట్టిగా కావాలనుకోవడంగాని, వద్దనుకోవడంగాని, చాలా శక్తివంతమైనవేకాని, అవి కేవలం అలవాట్లు మాత్రమే. ప్రయత్నిస్తే మనమంతకన్నా మంచి అలవాట్లే అలవర్చుకోగలుగుతాం.నీ చేతుల్లో లేని విషయాలపట్ల కలతచెందుతుండే అలవాటుని అదుపుచేసుకోవడం నేర్చుకో.అందుకుబదులు నీ చేతుల్లో ఉండి నీకు మేలుచెయ్యనివాటిని నిగ్రహించడం మొదలుపెట్టు.

2.
నిన్ను బాగా సంతోషపెడుతున్న విషయాలగురించి ఒక్కసారి ఆలోచించు- నువ్వు వాడుతున్న పనిముట్లు, నువ్విష్టపడుతున్న మనుషులు. కాని ఒకటి గుర్తుపెట్టుకో,వాటి గురించి మనమేమనుకుంటున్నామన్నదాంతో సంబంధం లేకుండా వాటికంటూ వాటికొక ప్రత్యేక ధర్మం కూడా ఉంటుంది.ఉదాహరణకి, నువ్వు బాగా ఇష్టపడుతున్న చిన్నచిన్న విషయాలతోటే మొదలుపెట్టు. నీకు బాగా ఇష్టమైన మట్టిపాత్ర. నీకదంటే బాగా ఇష్టం. కాని గుర్తుపెట్టుకో. అది మట్టిపాత్ర. ఏదో ఒక రోజు పగిలిపొయ్యేదే. అట్లాపగిలిపోయినప్పుడు తట్టుకోగలగడం కూడా నేర్చుకో.అట్లాగే నీకు ఇష్టమైన మనుషుల విషయంలో కూడా.

3.
విషయాలు వాటంతటవే మనల్ని బాధపెట్టేవీ కావు, అడ్డగించేవీ కావు.అలాగే మనుషులు కూడా.మనమా విషయాల్నెట్లా చూస్తున్నామన్నది వేరే సంగతి. కాని విషయాలపట్లా, మనుషుల పట్లా మన వైఖరి, మన ప్రతిస్పందనలు-అవే మనని బాధపెట్టేది...మన బాహ్యపరిస్థితులెలా ఉండాలో మనం శాసించలేం. కాని వాటిపట్ల ఎలా ప్రతిస్పందించాలన్నది మాత్రం పూర్తిగా మన చేతుల్లో ఉన్న విషయమే.

4.
మనం నైతికంగా పురోగమిస్తున్నామన్నదానికి స్పష్టమైన ఒక కొండగుర్తు ఇతరుల్ని తప్పుపట్టే గుణం మనలో నెమ్మదిగా తగ్గిపోతుండటమే.ఊరకనే ఎదుటివాళ్ళను వేలెత్తి చూపడం నిరర్థకమని గ్రహించడమే.

5.
ఏదీ మననుంచి దేన్నీ కాజెయ్యలేదు. మనం పోగొట్టుకునేదంటూ ఏదీ లేదు.'నేనిది పోగొట్టుకున్నాను ' అనుకోవడం మానేసి 'నేను ఫలానాదాన్ని ఎక్కణ్ణుంచి తెచ్చుకున్నానో అక్కడే పెట్టేసాను 'అని ఎప్పుడనుకుంటావో అప్పుడే నీ ఆంతరంగిక ప్రశాంతి మొదలవుతుంది.

6.
నీ జీవితం నువ్వొక విందుకు వెళ్ళడంలాంటిది. నువ్వక్కడ చాలా హుందాగా ప్రవర్తించవలసిఉంటుంది.నీ ముందు వంటకాల వడ్డన సాగుతున్నప్పుడు నువ్వు మితంగా హుందాగా వడ్డించుకోవాలి.వడ్డించేవాళ్ళు నీ ముందు ఆగలేదా, నీ పళ్ళెంలో ఏముందో దానిమీదే దృష్టిపెట్టాలి. వడ్డించేవాళ్ళింకా నీ వైపు రాలేదా, ఓపిగ్గా ఎదురుచూడాలి.

7.
నువ్వు అత్యున్నతమైన నువ్వుగా మారడం మీద తప్ప మరిదేని మీదా దృష్టిపెట్టకు. ఎందుకంటే, నువ్వు నువ్వుగా మారడం పూర్తిగా నీ చేతుల్లో ఉన్నదే.

8.
నిన్ను అవమానించడం, బాధపెట్టడం ఎవరివల్లా కాదని గుర్తుపెట్టుకో. ఎవరైనా నిన్ను తిడితే, కొడితే, నువ్వు అవమానానికి గురయ్యావని అనుకుంటే. అది అవమానానికి గురయ్యావని నీకు నువ్వు చెప్పుకోవాలని అనుకోవడం తప్ప మరేమీ కాదు.

9.
ప్రతి దానికీ రెండు హాండిల్సు ఉంటాయి. దాన్ని పట్టుకోవడానికి ఉపయోగించేదొకటి, పట్టుకోడానికి వీలుకానిది మరొకటి. ఉదాహరణకి నీ అన్నదమ్ముడో, అక్కచెల్లెలో నీతో సరిగ్గా ప్రవర్తించలేదనుకో, అప్పుడు నువ్వు బాధపడితే నువ్వా విషయాన్ని పట్టుకోలేని హాండిల్ వైపు పట్టుకోవడానికి చూసినట్టు. అలా కాకుండా, ఆ బాంధవ్యాన్ని పట్టుకోగలిగే హాండిల్ వైపు పట్టుకోవడానికి ప్రయత్నించు. అంటే, మీ మధ్య ఉన్న బాంధవ్యం చిన్నప్పుణ్ణుంచీ, తల్లికడుపునుంచీ మొదలయ్యిందనీ, అది కలకాలం ఉండవలసిందనీ, దాన్నెట్లాగైనా నిలుపుకోవాలనీ ఆలోచించు.

10.
నిజమైన సంతోషం నామవాచకం కాదు, క్రియాపదం.  

Saturday, October 26, 2013

||ఓ క్షణం కవితైన వేళ... || జయశ్రీనాయుడు


కవీ..
ఎక్కడి కాలాన్నో తెచ్చి 
హృదయాన్ని అద్ది 
పదాల పోగులకి తళుకులద్దే అద్దకపు పని వాడివి

కొంచెం ప్రేమ కొంచెం కన్నీరు 
మిణుగురుల్లాంటి ఆశలూ 
తూనీగలంటి కొంటెతనాలూ
నీ చుట్టూ పోగేసుకుంటావు
ఓ స్వాప్నిక ప్రేమ మయమౌతావు! 




నీలోని అణువణువూ అనుభూతిమయమైనపుడు
పంచుకోలేని ఏకాంత సమయమైనపుడు
కలలన్నీ కణాల్ని నిప్పుకణికల్ని చేస్తున్నపుడు 
నీ లోని కల్లోలానికి తిరుగుబాటు నేర్పుతావు 
అక్షరాల సైన్యం తో సామ్రాజ్యాలు జయిస్తావు 

నీలోని బాధ గట్లు తెగి ప్రవహిస్తే 
నీలోని లోతులు నిన్ను స్పృషిస్తే
నీలోని ఆకాశం దిక్కులు చాలనిదైతే
భోరుమనే రోదనే రుద్రావతారమైతె.. 
పద తాండవానికి వేదికవవుతావు 




నిరాశల దుప్పట్లని కప్పుకున్న హృదయాన్ని 
నిలువునా దహించే ధైర్యంతో 
నీకు నీవే స్నేహిస్తూ 
జీవితపు అడవిలో దాగిన అందాల్ని చూపే వెన్నెలౌతావు 

అక్షరాల దారుల్ని దాటి 
వెలుగులోని వేగుచుక్కని పలకరిస్తావు

అందుకే.. పదాల ప్రాణానివి
గుండె సడి అనువాదానివి 
ఎన్నో కాలాల సాక్షివి

ఆ క్షణానికి సార్థకతవి!!!!



https://www.facebook.com/groups/kavisangamam/permalink/643640909021998/?notif_t=like

A Poem for the Day -- Vadrevu Ch Veerabhadrudu - 26 October 2013

ఆలోచిస్తున్నాను,నిన్ను వదిలిపెట్టగలనేమోగాని
నువ్వు నా దేహంలో కుట్టిపెట్టిన సూర్యకాంతినెట్లా
వదులుకోగలను?తోటనుంచి బయటకు రాగలనేమో
కాని మనసుమీద పడ్డ పరాగధూళి దులపలేను

అప్పుడు మరేధ్యాసాలేకుండా గంపలకొద్దీ చైత్రకాంతి
పోగుచేసుకుంటూ గడిపాం,ఆకాశం కొమ్మ ఎక్కడ
వంచినా రాగాలరవ్వలు రాలిపడ్డ కాలం,బాల్యం
యవ్వనం రెండూ ఒక్కసారే వర్షించిన అద్భుతం.

చిన్నప్పుడు విన్న చీమా, గొల్లభామలకథ. ఐనా
ఒక చీమలాగా జీవించడం నాకు చాతకాలేదు
ఉన్నట్టుండి తుపాను తలుపులు మూసేసినప్పుడు
సూర్యకాంతి మిగిలేది గొల్లభామకు, చీమకు కాదు. 




Friday, October 25, 2013

About Faiz Poem and Poetry by Abd Wahed


 తెలుగు వారికి తెలిసిన ఉర్దూ కవులు తక్కువ. గజల్ పట్ల అభిమానం ఉన్న వారు తప్ప మిగిలిన తెలుగు పాఠకులకు ఉర్దూ కవుల గురించి పెద్దగా తెలియదు. తెలిసిన పేర్లలో కూడా గాలిబ్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఉమర్ ఖయాం పేరు కూడా వినబడుతుంది,కాని నిజానికి ఆయన ఉర్దూ కవి కాదు. ఆయన కవిత్వం ఉర్దూలో తర్జుమా అయ్యింది. తెలుగు వారికి చాలా తక్కువ తెలిసిన పేరు ఫైజ్, భారత ఉపఖండం రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న కాలంలో గొప్ప కవిత్వం రాసిన కవి ఆయన.

ఫైజ్ అహ్మద్ ఫైజ్ ప్రతి సందర్భంలోను కవిత రాశారు. చాలా ఎక్కువగా రాశారు. ఏడు కవితా సంపుటాలు ఆయన పేరున ఉన్నాయి. ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు. రాజకీయాల పట్ల లోతయిన అవగాహన ఉన్న వ్యక్తి. గతవారం చెప్పుకున్నట్లు ట్రేడ్ యూనియన్లలో ఉన్నరు. సామ్యవాద భావాల పట్ల ప్రభావితులయ్యారు. ప్రగతిశీల రచయితల వేదిక అప్పట్లో సామాజిక అంశాలన్నింటిపై ప్రతిస్పందించేది. అందులో అత్యంత చురుకైన వ్యక్తి ఫైజ్.
ఫైజ్ రాసిన కవితా సంపుటాల్లో మొదటిది నక్ష్ ఫరియాది (ఫిర్యాదు చేస్తున్న చిత్రం). నిజానికి ఇది గాలిబ్ కవితలోని ఒక పంక్తిలోని పదబంధం. దాన్నే ఫైజ్ తన కవితకు వాడుకున్నారు. ఆ కవితా సంపుటం అదే పేరుతో వచ్చింది. అమృతసర్ లోని ఎం.ఏ.ఓ. కళాశాలలో అధ్యాపకుడిగా చేరిన కొత్తలో రాసిన కవితలివి. 1941లో ఈ సంపుటం అచ్చయ్యింది. సాధారణంగా కవులందరి మాదిరిగానే ప్రారంభంలో రాసిన కవితలు ప్రేమ కవితలే. కాని ఈ సంపుటంలో తర్వాత తర్వాత రాసిన కవితల్లో ప్రేమ, విప్లవ భావాలు కలగలిసి కనబడతాయి. ప్రేమ విరహ బాధలే కాదు ప్రపంచ బాధలు కూడా పంక్తుల్లో ఉన్నాయి. ప్రారంభంలో రాసిన కవితలు ఒకవిధమైన స్వాప్నిక ఊహలను ప్రతిబింబిస్తాయి. మేరే నదీమ్, హుస్న్ ఔర్ మౌత్, ఆజ్ కీ రాత్ ఇలాంటి కవితలే. ఫైజ్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కళాశాల వైస్ ప్రిన్సిపల్ మహ్ముదుజ్జఫర్, ఆయన భార్య రాషిదా జహాన్ ఇద్దరు కమ్యునిస్టు పార్టీలో క్రియాశీల సభ్యులుగా ఉండేవారు. వారిద్దరి ప్రభావం వల్ల ఫైజ్ సామ్యవాద సిద్దాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడు. సామ్యవాద ప్రభావం ఆయన రాసిన కవిత – ముజ్ సే పహలీ సీ ముహబ్బత్ మేరే మహ్ బూబ్ నా మాంగ్ (ప్రియా, మునుపటి ప్రేమను ఇప్పుడు కోరవద్దు)లో స్పష్టంగా కనబడుతుంది. తన ప్రేయసి అద్భుత సౌందర్యంతో కళ్ళు తిప్పుకోలేక పోతున్నప్పటికీ, తాను ప్రపంచంలోని కష్టాలను కూడా చూడక తప్పదని అంటాడు. ఈ కవితా సంపుటిలోని ఇతర కవితలు తర్వాత అనేక ఉద్యమాల్లో ప్రేరణ గీతాలయ్యాయి. సంకెళ్ళు, శృంఖలాలు, నిర్బంధాలు ఉన్నప్పటికీ గొంతెత్తాలని నినదించిన కవిత .. బోల్ కె లబ్ అజాద్ హైం తేరే, బోల్ జుబాన్ అబ్ తక్ తేరీ హై (చెప్పు, నీ పెదాలు స్వేచ్ఛగానే ఉన్నాయి, చెప్పు, నీ నాలుక ఇంకా నీదే)లో రాసిన పదాలు భారత పాకిస్తాన్ లలో అనేక నిరసర ఉద్యమాల్లో ప్రతిధ్వనించాయి.
మోజూయె సుఖన్ కవితలో ఒక కవి ఆలోచించవలసిన విషయాలేమిటో ముక్కుసూటిగా చెప్పేశాడు. ప్రేయసి కురుల మృదుత్వం, గోరింటాకు చేతుల లాలిత్యం గురించి ఆలోచించాలా లేక ఆదమ్ ఈవ్ సంతానం (మానవాళి) ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కుంటున్న కష్టాలు కడగండ్ల గురించి ఆలోచించాలా అని ప్రశ్నించాడు. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న ఆకలి, దారిద్ర్యం, దౌర్భాగ్యాలను ప్రశ్నించడం కవుల పని కాదా అని నిలదీశాడు.
ఫైజ్ కవిత్వం ఉద్యమాల ఉప్పెన. ఆయన జీవితం కూడా ఉద్యమాలలోనే గడిచింది. ప్రేయసి చుట్టు తిరిగే కవిత్వాన్ని మనిషి చుట్టు తిప్పిన కవి ఫైజ్.. అందుకే ఫైజ్ గురించి మరి కొన్ని వారాలు కొనసాగిద్దాం..
ఇప్పుడు ఫైజ్ రాసిన ఒక కవిత చూద్దాం.

ప్రియా, మనుపటి ప్రేమను నా నుంచి కొరవద్దు
నీవుంటే జీవితం శాశ్వతంగా ప్రకాశిస్తుందని
ఎల్లప్పుడు అనుకున్నా
ప్రేమబాధ నాదే అయినప్పడు, ప్రపంచబాధ గొడవెక్కడ
నీ నగుమోము ప్రపంచంలో వసంతాన్ని విరజిమ్ముతుంది
నీ కళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకేముందని?
నీవు దొరికితే అదృష్టం నా అడుగులకు మడుగులొత్తుతుంది

కాని అలా కాదు, అలా కావాలని అనుకున్నానంతే...
ప్రపంచంలో ప్రేమే కాదు, ఇంకా దు:ఖాలున్నాయి
ప్రేమికుల కలయికే కాదు, ఇంకా సంతోషాలున్నాయి
శతాబ్ధాలుగా విస్తరిస్తున్న నల్ల మంత్రజాలం
సిల్కు, శాటిన్, బంగారు దారాలతో అల్లుకుంటోంది

వీధుల్లో బాజారుల్లో ఎటు చూసినా దేహాలు అమ్ముడుపోతున్నాయి
దుమ్ములో చుట్టబడి, రక్తమోడుతున్న దేహాలు
కష్టాల కొలుముల్లో నుంచి ఉబికి వస్తున్నాయి
రసికారుతున్న మానని పుండ్లతో...
దృష్టి అటే పోతోంది... ఏం చేయాలి?
నీ సౌందర్యం ... ఇప్పుడు కూడా 
కళ్ళను ఆకట్టుకుంటున్నా.. ఏం చేయాలి?

ప్రపంచంలో ప్రేమే కాదు, ఇంకా దు:ఖాలున్నాయి
ప్రేమికుల కలయికే కాదు, ఇంకా సంతోషాలున్నాయి
ప్రియా, మనుపటి ప్రేమను నా నుంచి కొరవద్దు

ఫైజ్ రాసిన ఉర్దూ కవిత

ముఝ్ సే పహలీసి ముహబ్బత్ మేరె మహబూబ్ న మాంగ్
మైం నే సంఝా కె తూ హై తో దరఖ్ షాం హై హయాత్
తేరా గమ్ హైతో గమె దహర్ కా ఝగడా క్యా హై
తేరీ సూరత్ సే హై ఆలమ్ మేం బహారోం కో సబాత్
తేరీ ఆంఖోం కె సివా దునియా మేం రఖా క్యా హై
తూ జో మిల్ జాయె తో తగ్ దీర్ నిగోం హోజాయె

యుం న థా మైం నే ఫఖత్ చాహాథా యుం హో జాయె
ఔర్ భీ దుఖ్ హై జమానే మేం ముహబ్బత్ కె సివా
రాహతేం ఔర్ భీ హైం వసల్ కి రాహత్ కె సివా
అన్ గినత్ సదియోం కె తారీక్ బహీమా న తిల్సిమ్
రేషమ్ వ తిల్స్ వ కంఖూబ్ మేం బున్వాయె హుయే

జాబజా బిక్తే హువే కూచ వ బాజార్ మేం జిస్మ్
ఖాక్ మేం లిథడె హువె, ఖూన్ మేం నహాయె హువే
జిస్మ్ నికలే హువే అమ్రాజ్ కె తన్నూరోం సే
పీప్ బహతీ హుయీ గల్తే హువే నాసూరోం సే
లౌట్ జాతీ హై ఉధర్ కోభి నజర్ క్యా కీ జియే
అబ్ భీ దిల్ కష్ హై తెరా హుస్న్ మగర్ క్యా కీ జియే

ఔర్ భీ దుఖ్ హై జమానే మేం ముహబ్బత్ కె సివా
రాహతేం ఔర్ భీ హై వసల్ కె రాహతోం కె సివా
ముఝ్ సే పహలీ సి ముహబ్బత్ మెరె మహ్ బూబ్ న మాంగ్

చివరిగా మరో మాట, హిందీ సినిమా పాటల్లో సూపర్ హిట్ క్లాసిక్ సాంగ్ ... తేనీ ఆంఖోం కె సివా దునియ మేం రఖ్ఖా క్యా హై .. యే ఉఠే సుబహ్ చలే.. యే ఝుకె రాత్ ఢలే...పాట గుర్తుందిగా...1969లో వచ్చిన చిరాగ్ సినిమాలోని పాట ఇది. ముహమ్మద్ రఫీ పాటిన ఈ పాటకు మజ్రూ సుల్తాన్ పురి గీత రచయిత. పల్లవిలో మొదటి పంక్తి, ఫైజ్ రాసిన ఈ కవితలోని పంక్తినే మజ్రూ తీసుకున్నారు. ఈ ఒక్క పంక్తిపై ఆయన పూర్తి పాట అల్లుకున్నారు. నేటికి కూడా ఈ పాట వినబడితే చెవులారా వింటాం.

Source Link

https://www.facebook.com/groups/kavisangamam/permalink/642997865752969/

Thursday, October 24, 2013

A Tear And A Smile by Kahlil Gibran

I would not exchange the sorrows of my heart
For the joys of the multitude.
And I would not have the tears that sadness makes
To flow from my every part turn into laughter.

I would that my life remain a tear and a smile.

A tear to purify my heart and give me understanding
Of life's secrets and hidden things.
A smile to draw me nigh to the sons of my kind and
To be a symbol of my glorification of the gods.

A tear to unite me with those of broken heart;
A smile to be a sign of my joy in existence.

I would rather that I died in yearning and longing  than that I live Weary and despairing.

I want the hunger for love and beauty to be in the
Depths of my spirit,for I have seen those who are
Satisfied the most wretched of people.
I have heard the sigh of those in yearning and Longing, and it is sweeter than the sweetest melody.



With evening's coming the flower folds her petals
And sleeps, embracingher longing.
At morning's approach she opens her lips to meet
The sun's kiss.

The life of a flower is longing and fulfilment.
A tear and a smile.

The waters of the sea become vapor and rise and come
Together and area cloud.

And the cloud floats above the hills and valleys
Until it meets the gentle breeze, then falls weeping
To the fields and joins with brooks and rivers to Return to the sea, its home.

The life of clouds is a parting and a meeting.
A tear and a smile.

And so does the spirit become separated from
The greater spirit to move in the world of matter
And pass as a cloud over the mountain of sorrow
And the plains of joy to meet the breeze of death
And return whence it came.

To the ocean of Love and Beauty----to God.

Tuesday, October 22, 2013

A Poem For the Day -- Vadrevu Ch Veerabhadrudu

ప్రేమపరితప్తులైన సమయాల్లో, కళ్ళల్లో కన్నీటిపొరలు
పేరుకుంటున్నప్పుడు, గొంతు గద్గదమయ్యేవేళల్లో
నిలవనివ్వని రక్తవేగోధృతి ముందు మీరొకరినొకరిని
పరికించుకుంటూ దేహాల్ని దాటి చూడాలనుకుంటారు



ఒకరికొకరు దూరంగా ఉండవలసివచ్చినప్పుడు, తీవ్ర
వియోగదు:ఖం త్వరితంగా కాల్చేస్తున్నప్పుడు, ఇది
నాకు అవసరమా అనుకుంటారు.మెలిపడ్డ మనసుల్ని
విప్పి మామూలు మనుగడ సాగించాలనుకుంటారు



కొన్ని క్షణాల్లో స్వర్గలోకపు అంచుల్ని తాకుతుంటారు
మరికొన్నివేళల్లో నేలకుజారిపోతారు, బహుశా ప్రేమ
సంతృప్తులైనప్పుడు మీరు కోరుకోవలసింది స్వర్గంకాదు,
భూమి కాదు; ఆ రెంటినీ సమంగా నిభాయించడం 

Saturday, October 12, 2013

||సముద్రానికో విన్నపం || జయశ్రీనాయుడు


అతి సామాన్యం నువ్వు
అలా వొచ్చీ ఇలా వెళ్ళే నడక నీది..
అన్నీ దాచుకుని అలలు అలలుగా గుంభనపు నవ్వులూ

నీలోకి నడిచొచ్చే ప్రతి నావనీ 
పొత్తిళ్ళలో పాపలా లాలిస్తూ
నీదగ్గర వున్నదేదో ఇచ్చి పంపుతావు
తెడ్లైన మరలైనా 
నిన్ను కోసుకుంటూ వెళ్ళినా 
నీతో ఆటలే అనుకుంటావు.. 

నీ చీర చెంగులా పరుచుకున్న తీరం 
అంచులు తడుముకుంటూ వెళ్ళాను
అంతలోనే తండ్రిలాంటీ గుంభనపు గూడు చూశాను
ఎంతకాలమలా గడిచిపోతుందో తెలీదు
నీ అనంతమంటే నా కంటికి ఓ దీక్ష
జీవితమంతా చేపట్టాలనిపిస్తుంది

అప్పుడప్పుడు అకారాన్ని ముందు పెట్టుకుని
ఎత్తులు కొలవలేని
కొలతలకు అందని
అసామాన్యమవుతావు..
ఎవరి మీద కోపం చెప్పు
నీలో నీకె మధనమవ్తూ
తీరాల్ని బద్దలు కొడుతూ
అర్థం కాని నాన్నల కోపంలా 
భయపెడుతుంటావు 




ఒక్క మాట చెప్పొచ్చుగా.. 
ఆవరణం దాటినా 
ఆకాశాన్ని కొలవాలని నీకనిపించినా
చీకటిని పగలే చూపెట్టి భయపెట్టాలనిపించినా
నీ లోతుల్లో మర్మాలనీ... గాయలనీ పోగేసుకుని కుమిలిపోయిన క్షణాల్లో.. ఒక్క లిప్తని ఇలా ప్రకటిస్తుంటావు...

నీలం.. కత్రినా.. ఫైలిన్... మా భాషకు అందేవి ఇవే.. 
నీ వెంతచెప్పినా అర్థం చేసుకోలేని భాషలు మావి
అలల ఎత్తుల్లో ఆపదల్నీ
మబ్బుల్లో అల్ప పీడనాన్నీ
వాయుగుండమనే గండాన్నీ చూడటమే మాకొచ్చు
నీ బాధకు యే తయెత్తూ కట్టలేను
నీకేం కావాలో తీసుకెళ్ళు అనడం తప్ప
కానీ మనిషిని కదా.. ప్రాణమంటే తీపెక్కువ
అది మాత్రం వొద్దులే.. నీకెలాగూ ఉప్పదనమే ఇష్టం అని గుర్తు చేస్తున్నా..  





https://www.facebook.com/groups/kavisangamam/635864246466331/?comment_id=635870233132399&notif_t=like