Wednesday, October 9, 2013

||జీవితపు ప్రశ్నార్థకం...|| జయశ్రీనాయుడు



అక్కడ పరదా కి
అంతులేని ముఖచిత్రాలు 
రేఖామాత్రంగా అయినా కదలని పలకరింపు.. 
ఒక ప్రకంపనం ఉవ్వెత్తున లేస్తుంది
హృదయమా.. ఆ ఘోషలో కెరటమా.. 

ప్రశ్నలన్నీ.. 
పోగేసిన ప్రశ్నార్థకాలై
ఐక్యంగా..  
సమానార్థకాల్ని వెతుక్కుంటాయి..

సమాధానలవసరం లేని 
సరిహద్దొకటి నిలబడుతోంది 
ఒక్కో శూన్యమే ఇటుకగా
నలిగిన వేదనాకాలమే వీధి దీపంగా.. 

ఐనా అడుగులు అలగవు
ఇసుకరేణువుపైనా తన గురుతు వెతుక్కుంటాయి 
పోగేసి అరచేతుల్లోంచి మళ్ళీ జారవిడిచి
నవ్వుతున్న చుక్కల్త్లో నింగిలా మారిపోతాయి

No comments:

Post a Comment