Monday, September 30, 2013

ఓ స్నేహం... కొంత జ్ఞాపకం -- జయశ్రీనాయుడు

 కొన్ని సాయంత్రాలు 
చల్లిన క్షణాల విత్తులకి 
జ్ఞాపకపు జల్లుల్ని చిలకరించి 
చెరోదారీ పట్టాం 

నీటిని పీల్చిన మట్టిలా 
అదే మామూలు తనాన్ని కప్పెసుకున్నాం 

గడుస్తున్న కాలం ఇసక మేటలా వుంటుంది
నడుస్తున్న మేరా ముద్రలు మాయమే 

అలలా అపుడపుడూ ఉబికి వచ్చిన కన్నీరు
ఒక చెమ్మని హృదయానికి గుర్తుచేస్తోంది 

గుండె తాకిన ఓ నవ్వు ఓ పలకరింపూ
నేలమీదే నీ జ్ఞాపకపు ఆకాశాన్ని పరిచేశాయి 


https://www.facebook.com/groups/kavisangamam/permalink/629587683760654/?notif_t=like

Friday, September 27, 2013

|| కాలాక్షరమా... || -- జయశ్రీనాయుడు



తీరంలా చొచ్చుకొస్తోంది ఓ ఖాళీతనం 

చేరని పిలుపుల్లో
పలకని పలకరింపుల్లో

పచ్చదనం అలాగే వుంది
పూల పరిమళం ప్రవహిస్తూనే  వుంది
మరి వేళ్ళెక్కడికి పయనమయ్యాయీ

యే బాటసారికీ చెప్పలేదు
పాద ముద్రలైనా మిగిల్చలేదు

తేలికతనాన్ని వొంపేస్తూ
భారాల్ని గుమ్మరిస్తూ 
పక్షి ఈకలా పయనమయ్యింది 

రాత్రితో ప్రయాణించి 
కాలమనే కలంలో నింపి 
రూపం లేని లిపి ఎదురయ్యింది 
అక్షరీకరించే కల ఎక్కడా.. 

Responses at Kavisangamam 
  • Nirmala Srinivas రాత్రితో ప్రయాణించి 
    కాలమనే కలంలో నింపి 
    రూపం లేని లిపి ఎదురయ్యింది 
    అక్షరీకరించే కల ఎక్కడా.. nice andi
  • Mohan Ravipati పచ్చదనం అలాగే వుంది
    పూల పరిమళం ప్రవహిస్తూనే వుంది
    మరి వేళ్ళెక్కడికి పయనమయ్యాయీ
  • Pusyami Sagar తేలికతనాన్ని వొంపేస్తూ
    భారాల్ని గుమ్మరిస్తూ 
    పక్షి ఈకలా పయనమయ్యింది 
    wah
  • Mehdi Ali పచ్చదనం అలాగే వుంది
    పూల పరిమళం ప్రవహిస్తూనే వుంది
    మరి వేళ్ళెక్కడికి పయనమయ్యాయీ nice lines
  • Kavi Yakoob ప్రతి అక్షరం కవితను ఉన్నతీకరించాయి. చెప్పిన విషయం గాఢంగా ఉంది. కొన్ని సందర్భాల్లో వస్తువే కవితను నిలబెడుతుంది.అదే జరిగింది ఈ కవితలో.
  • Santhisri Santhi ప్రతి అక్షరం కవితను ఉన్నతీకరించాయి..!
  • Abd Wahed తీరంలా చొచ్చుకొస్తోంది ఓ ఖాళీతనం ...చాలా బాగుంది
  • Jyothirmayi Malla తీరంలా చొచ్చుకొస్తోంది ఓ ఖాళీతనం
    chala bagundi jayasree
  • Mercy Suresh Jajjara తీరంలా చొచ్చుకొస్తోంది ఓ ఖాళీతనం /పూల పరిమళం ప్రవహిస్తూనే వుంది /తేలికతనం పక్షి ఈకలా పయనమయ్యింది /రూపం లేని లిపి ఎదురయ్యింది / ఇవ్వన్నీ భలే వాడారు.. బాగుందక్కా కవిత
  • Nagendra Bhallamudi రాత్రితో ప్రయాణించి
    కాలమనే కలంలో నింపి
    రూపం లేని లిపి ఎదురయ్యింది
    అక్షరీకరించే కల ఎక్కడా..
    nice madem
  • Srinivas Vasudev మీరు మాటల్ని వాడుకున్నంతగా మరెవ్వరూ వాడరు..అదే మిమ్మల్ని ఓ కవయిత్రిగా నిలబెట్టింది....ముఖ్య్హంగా కవిత్వంలో క్లుప్తత గురించి మీ నుంచే నేటి తరం కవులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ కవిత ద్వారా చెప్పకనె చెప్పారు జయా...thanks for sharing this good poem Jayashree Naidu gaaru
  • Gubbala Srinivas Chaaaaala bagundi mam

Sunday, September 8, 2013

Poem of the Day by Vadrevu Chinaveerabhadrudu 8 Sept


అప్పుడప్పుడనిపిస్తుంది,ప్రేమించినప్పుడు నీ అవస్థ
గ్రీకు ఇతిహాసాల్లో సముద్రయానానికి సంసిద్ధమైన
నావికుల్లాంటిదని.తాళ్ళు, తెడ్లు,తెరచాపలు,తెగింపు,
అన్నీ ఉంటాయి, సానుకూలంగా వీచే గాలితప్ప.

ప్రార్థించడం, ప్రార్థించడం తప్ప మరో దారి లేదు.
అవతలిఒడ్డు కనిపించని ఇవతలితీరం మీద ఒక
శిశువులాగా నిస్సహాయంగా సంచరించక తప్పదు
ఆకాశం తెరుచుకునేదాకా కైమోడ్చిఉండకతప్పదు

ప్రయాణసన్నద్ధులైకూడా ముందడుగు పడనప్పుడు
తెలుస్తుంది, ప్రేమించడమంటే ఒకరినొకరు బలవంత
పెట్టుకోలేని బలహీనతని, ఎట్లాగైనా బలమంతా 
కూడదీసుకు మరీ ఆ బలహీనత కాపాడుకోడమని.