Saturday, January 11, 2014

చిరు నీటి బిందువు -- Jayashree Naidu

మనసు బరువు కంటికే తెలుస్తుంది
కోత గుర్తు లేకపోయినా 
గుండె నడుగు జవాబు.. 

నవ్వులంత తేలిక కాదు 
ఉప్పదనం దాచుకునే చేదు
ఉరికే నదులు చిన్నబోయే
చిరు నీటి బిందువు

కరిగిన కలనుంచి పుడుతూ
ఖాళీని తీసుకెళ్తూ
 కళ్ళు నిండే హృదయం
మౌనం సముద్రం

కనుకొలకుల చెలియలికట్ట దాటి
తీరంలాంటి చెంప మీద జారే క్షణంలో
ఎన్ని ఇసకరేణువులవుతుందో ఆ కల
చెయ్యల్లే వొచ్చి  తుడుచుకునే వేళలో...



No comments:

Post a Comment