పేజీ నిండిన డైరీ…
చేతుల్లో అక్షరాలై పలకరింపు
ఖాళీలను పోగేస్తూ
జ్ఞాపకాల్లో వొంపుతూ
క్షణాలన్నిటినీ విసిరేస్తున్నా..
చప్పుడు చేయకుండా పలకరించే
కన్నీటి చుక్కలా…
కలలన్నీ కలవరపడొద్దని చెప్పు
చూడని వెలుగు విస్తరిస్తుంది
వెన్నెల దాచుకున్న మబ్బు చెదిరిపోతుంది
ఆకాశమంత జీవితం లో
హృదయాన్ని చిమ్మేసిన వానజల్లిప్పుడు
గడియారమంతా
కారణాలేవీ లేని క్షణాలు
శరీరమంతా
కలవరింతల్లేని స్వప్నాలు
సావాసం చూరు కప్పెయ్యని
ఆలోచనల కువకువల కొమ్మలు మొలిచాయి..
సృష్టిస్తున్నా..
కొలతల్లో ఇమడని కాలం .. నా కోసం
.
జయశ్రీ నాయుడు
http://teluguanuvaadaalu.wordpress.com/2013/11/18/shakehand-jayashree-naidu-telugu-indian/
No comments:
Post a Comment