Friday, June 21, 2013

||తడవని తలపులు|| జయశ్రీనాయుడు



వారధి లెదక్కడ 

కాల ప్రవాహమే ఇక్కడ..

సముద్రం కాదుకదా
తీరాలు చేరదిక్కడ

పదాల ఇటుకల్లేని
నిశ్శబ్దపు గోడలే అంతటా..

మనసు వెతుకులాట
ముగిసేదెపుడో...

తుఫాను లో ఎంతసేపు తడిస్తే యేం...
నీటి చుక్కైనా మిగిలదు
కంటికీ.. మింటికీ...


--జయశ్రీ నాయుడు

No comments:

Post a Comment