Thursday, June 20, 2013

టాస్ ప్లీజ్... -- జయశ్రీనాయుడు

ప్రియమైన నీకు

నాలోని నేనుతో నేనుగా చెప్పుకునే 

కొన్ని మాటలు..

నిశ్శబ్దంతో 

టగ్ ఆఫ్ వార్ చేసీ 

ఆట ముగింపుగా

కౌగిలించిన అలుపు 





తెగి పడ్డ ఆలోచనల్నీ

రక్తంలా పారిన కాలాన్నీ

నిర్ఘాంత పోయి చూస్తూన్న మనసూ

సంధి కుదిరిందేమో

మాటలన్నీ సర్రెండర్ అయిన ఆనవాళ్ళూ

ఎవరు గెలిచారో

ఓడిందెవరో..?????

గెలుపూ ఓటముల

టాస్ వేసుకుందామా...

-- జయశ్రీ నాయుడు

No comments:

Post a Comment